ముద్దుగుమ్మ మెహరీన్ ఈ ఏడాది ఎడా పెడా సినిమాలు చేసేసింది. ఒకదాని తర్వాత ఒకటి ఈ బ్యూటీ నటించిన సినిమాలు రిలీజ్‌కి పోటీ పడ్డాయి. ఏ సినిమా ప్రమోషన్‌కి వెళ్లాలో, ఏ సినిమా షూటింగ్‌కి వెళ్లాలో తెలియని గందరగోళం ఏర్పడిందట ఈ బిజీ షెడ్యూల్ కారణంగా మెహరీన్‌కి. గతేడాది ఒకే ఒక్క సినిమాతో వచ్చింది. 'కృష్ణగాడి వీరా ప్రేమగాధ'. ఒక సినిమానే అయినా కానీ మంచి విజయం అందుకుంది. ఈ ఏడాది మొత్తం నాలుగు సినిమాల్లో నటించింది. చాలా తక్కువ గ్యాప్‌లో విడుదలయ్యాయి ఈ నాలుగు సినిమాలు. వీటిలో రెండు సక్సెస్నిచ్చాయి.
ఈ ఏడాది తొలుతగా వచ్చిన 'మహానుభావుడు'తో మంచి హిట్ అందుకుంది. తర్వాత వచ్చిన 'రాజా ది గ్రేట్' కూడా మంచి విజయం అందించింది. 'జవాన్'తో ఫర్వాలేదనిపించినా, 'కేరాఫ్ సూర్య' నిరాశ పరిచింది. ఇలా వరుస ఆఫర్స్‌తో ఈ బ్యూటీకి లక్ కలిసొచ్చినా, నటన పరంగా మాత్రం మంచి మార్కులేయించుకోలేకపోయింది. అంతేకాదు మరీ బొద్దుగా అయిపోయిందనే విమర్శల నేపథ్యంలో సన్నబడేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందీ బ్యూటీ. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే, నటనకు సంబంధించి ఫుల్ మార్కులేయించేసుకుంది. తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పుకుంది. డాన్సులు ఇరగదీసేసింది.
తొలి సినిమా 'ఫిదా'తోనే అందరి దృష్టినీ తన వైపుకు తిప్పేసుకుంది. ఫుల్ జోష్‌తో స్క్రీన్‌పై సందడి చేసింది. ఇక రెండో సినిమా 'ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి'తోనూ అదే జోరుతో, మంచి విజయం అందుకుంది. చేసినవి రెండు సినిమాలే అయినా ఒకదానికి మించింది మరోటి. నటనలోనూ, స్క్రీన్ ప్రెజెన్స్లోనూ ఏ వంక పెట్టడానికి లేదు సాయి పల్లవికి. ఇలా ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ సాయి పల్లవి. తన యాక్టింగ్ టాలెంట్‌తో యూత్‌కి స్పెషల్‌గా ఇంట్రెస్టింగ్ కిక్కిచ్చింది.