మిక్కీ జే మేయర్ అనగానే మెలోడీలే గుర్తొస్తాయి. మిక్కీకి పేరు తీసుకొచ్చింది, తనని ప్రత్యేకంగా నిలబెట్టింది ఆ మెలోడీలే. అవి దాటి... ఏదో చేయాలన్నప్రయత్నం మిక్కీలో ఎప్పుడూకనిపించలేదు. దానికి కారణం.. తన దగ్గరకు వచ్చే కథలన్నీ క్లాస్ వే. శర్వానంద్ `శ్రీకారం`కి మిక్కీనే సంగీత దర్శకుడు. రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా క్లాసే అనుకోవాలి.
అయితే.. ఈ ఆల్బమ్ నుంచి వచ్చిన తొలి పాట.. మాసీగా దుమ్ము రేగ్గొట్టింది. `భలే గుంది బాలా.. `అంటూ పెంచలదాస్, రాసి పాడిన గీతమిది. మంచి జానపద బాణీ ఇది. పాడిన విధానం, ఆ పదాలు, సంగీత వాయిద్యాలు వాడుకున్న విధానం... ఇవన్నీ మంచి మాసీగా ఉన్నాయి. శర్వానంద్ వేసిన స్టెప్పులు కూడా సింపుల్ గాఉంటూ.. మాస్ కి నచ్చేలా ఉన్నాయి. చాలా కాలం తరవాత శర్వాకి మంచి మాస్ పాట పడినట్టైంది. చివర్లో ఫిమేల్ వెర్షన్ ఓ చరణం.. ఉంది. అది పాటని కాస్త స్లో చేసినట్టైంది. దాన్ని మినహాయించి చూస్తే.. ఇంకొంత కాలం వినిపించే పాటల్లో భలే గుంది బాలా.. కూడా చేరిపోయేట్టు కనిపిస్తోంది. కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది.