మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని ఘనంగా సత్కరించిన ఎఫ్ ఎన్ సి సి కార్యవర్గం

మరిన్ని వార్తలు

సౌత్ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడి ఎన్నో మంచి కార్యక్రమాలు, నిర్వహిస్తున్న సంస్థ ఎఫ్ ఎన్ సి సి. ఈ ఆదివారం సాయంత్రం ఏపీ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని ఘనంగా సత్కరించిన ఎఫ్ ఎన్ సి సి కార్యవర్గం   సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, జే. బాలరాజు గారు, ఏడిద రాజా గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు,మరియు ఎఫ్ . న్.సి.సి ఫార్మర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు .


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్ గారు, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ టి. ప్రసన్నకుమార్ గారు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నర్సాపూర్ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు మాట్లాడుతూ :  సౌత్ లోనే నెంబర్ వన్ క్లబ్ గా ఫిల్మ్ నగర్ క్లబ్ కి పేరు వుంది. 


ఎఫ్ ఎన్ సి సి ఎప్పుడు మంచి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. నేషనల్ గేమ్స్ మరియు  ప్రోగ్రామ్స్ చేస్తూ క్రీడాకారులను, కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సంస్థ ఇలాగే అంచలంచెలుగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ నా వంతు సహాయం ఎప్పుడు కావాలన్న క్లబ్ కి అందిస్తానని తెలియజేసుకుంటున్నాను అన్నారు.


ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు మాట్లాడుతూ : ప్రజా సేవలో ఎంతో బిజీగా ఉండి కూడా అడగగానే ఒప్పుకొని మా ఈ సత్కారాన్ని స్వీకరించినందుకు మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి కృతజ్ఞతలు. ఎఫ్ ఎన్ సి సి తరఫున చేసే కార్యక్రమాలను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ఇదేవిధంగా అందరూ ఇలానే సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలతో ఎఫ్ ఎన్ సి సి ని ఇండియా లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే విధంగా మా కార్యవర్గం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS