ఆ సినిమా ఎందుకు చేసిందంటే..

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ మిస్తీ చక్రవర్తి 'చిన్నదానా నీకోసం' సినిమాతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. నితిన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అమ్మడు క్యూట్‌గా కనిపించింది. తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది అమ్మడు. కానీ తెలుగు ప్రేక్షకులకు బాగానే రిజిస్టర్‌ అయ్యింది అమ్మడి బబ్లీ ఫేస్‌. త్వరలోనే 'బాబు బాగా బిజీ' సినిమాతో మన ముందకు రానుంది. శ్రీనివాస్‌ అవసరాల హీరోగా తెరకెక్కుతోంది ఈ సినిమా. నవీన్‌ మేడారం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లో విజయం సాధించిన 'హంటర్‌' సినిమాకి తెలుగు రీమేకే ఈ చిత్రం. ఇదో హాట్‌ మూవీ. ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది ఈ సినిమాలో విషయం ఏంటనీ. అయితే మిస్తీ ఎందుకు ఇలాంటి సినిమా చేసింది అంటే.. నటిగా నిలదొక్కుకోవాలంటే ఛాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌ చాలానే చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర అలాంటిదే. పాత్ర మెచ్చి, ఎంతో ఇష్టపడి ఈ సినిమాకి సైన్‌ చేశానంటోంది. బాలీవుడ్‌లో రాధికా ఆప్టే చేసిన పాత్రలో మిస్తీ నటిస్తోంది తెలుగులో. కమెడియన్‌గా, దర్శకుడిగా మెప్పించిన అవసరాల శ్రీనివాస్‌ ఈ సినిమాతో ఓ కొత్త ప్రయోగం చేస్తున్నాడు. అయితే ఈ ప్రయోగం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పిస్తుందనేది సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే కానీ తెలీదు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేశారట. ఈ సినిమాలో మిస్తీతో పాటు మరో ఇద్దరు భామలు కూడా నటిస్తున్నారు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS