ప్రశ్నించడానికే తాను ఉన్నది అని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, ఈ మధ్య వివిధ అంశాల పై ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నాడు.
అయితే ఆసక్తికరంగా, పవన్ ప్రశ్నించిన ఒక అంశం పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్వాగతించడం ఇటు సినీ వర్గాలనే కాక అటు రాజకీయ వర్గాలను కూడా విస్మయపరుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, ఉత్తర భారతదేశానికి చెందిన IAS అధికారిని TTDకి E.Oగా నియమించడం పట్ల పవన్ అభ్యంతరం వ్యక్తంచేశాడు.
ఈ సందర్భంలో మోహన్ బాబు E.Oగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ గారికి ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో ఆయన నిజాయితీన మెచ్చుకోవడమే గాక ఆయన పనితీరుపై నాకు నమ్మకం ఉందంటూ కితాబు ఇచ్చాడు. ఇక ఒకే ప్రాంత వ్యక్తిని TTD లాంటి సంస్థకి నియమించడం తప్పని, అలా చేయమని వాదించే వారితో తాను ఎకిభవించను అని స్పష్టం చేశాడు.
దీనితో పవన్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మోహన్ బాబు వ్యాఖ్యలు ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.