తమిళ సినిమా తని ఒరువన్‌కి రీమేక్ గా వచ్చింది 'ధృవ'. తని ఒరువన్ ఎంత హిట్టో.. ధృవ కూడా అంతే పెద్ద హిట్. తమిళంలో తని ఒరువన్ 2 తీయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. అయితే అంతకంటే ముందుగా ధృవ 2 వచ్చినా రావొచ్చు. తని ఒరువన్ కి మోహన్ రాజా దర్శకుడు. ధృవని కూడా ఆయనే రూపొందించాలి. కానీకుదర్లేదు. అయితే 'ధృవ 2' మాత్రం మోహన్ రాజా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.
'ధృవ 2' కథని రామ్ చరణ్‌కి చెప్పారు మోహన్ రాజా. చరణ్ కూడా ధృవ 2ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాకపోతే.. చరణ్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం శంకర్ సినిమాతో చరణ్ బిజీగా ఉన్నాడు. ఆ తరవాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ఉంటుంది. శంకర్ సినిమాకీ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకీ మధ్యలో కాస్త గ్యాప్ దొరికినా 'ధృవ 2' మొదలైపోతుంది.
''తని ఒరువన్ 2 తీయమని మా తమ్ముడు జయం రవి అడుగుతున్నాడు. మరోవైపు ధృవ 2 కూడా తీయాలని ఉంది. ఈ రెండు రీమేకుల్లో ఏది ముందు మొదలు పెడతానో ఇప్పుడే చెప్పలేను. ఎవరి డేట్లు ముందు దొరికితే వాళ్లతో సినిమా ఉంటుంది. ఈసారి ఈసీక్వెల్ పాన్ ఇండియా స్థాయిలోనే తీస్తా'' అని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా. ఆయన దర్శకత్వం వహిస్తున్న `గాడ్ ఫాదర్` దసరా కానుకగా బుధవారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.