ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్... ఒకే ఒక్క బిగ్ బాస్ షోతో సంపాదించుకోగలిగింది మోనాల్. దాదాపు 100 రోజులు హౌస్‌లో ఉండగలిగింది. బిగ్ బాస్ హౌస్‌లో ... మోనాల్ నడిపిన డ్రామా అంతా ఇంతా కాదు. లవ్ ట్రాక్‌తో.. ఎక్కువ రోజులు పాతుకుపోయింది. ఎమోషనల్ గా అందరినీ తన వైపుకు తిప్పుకుంది. చివరికి 98 రోజుల తరవాత ఎలిమినేట్ అయ్యింది. ఈ షోలో అత్యధిక పారితోషికం మోనాల్ దే అని టాక్. దాదాపుగా 30 లక్షలు సంపాదించి, వారెవా అనిపించుకుంది.
బయటకు వచ్చాక.. మోనాల్ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి బయటపెట్టింది. తన కెరీర్ ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఓ మలయాళీ వ్యక్తితో ప్రేమలో పడిందట మోనాల్. కొంతకాలం రిలేషన్ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోయార్ట. అతను సౌత్ ఇండియన్ కాబట్టే సౌత్ లో సినిమాలు తగ్గించుకున్నానని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షోతో.. తెలుగు ప్రేక్షకులకు మళ్లీ దగ్గరయ్యింది మోనాల్. ఈ గుర్తింపుతో తెలుగులో తనకు కొత్త అవకాశాలు వస్తాయని భావిస్తోంది.