అల్లరి నరేష్ హీరోయిన్ కి యాక్సిడెంట్

మరిన్ని వార్తలు

అల్లరి నరేష్ పక్కన రెండు చిత్రాలలో హీరోయిన్ గా చేసిన మోనాల్ గజ్జర్ కి తృటిలో పెద్ద రోడ్డు ప్రమాదం నుండి బయటపడింది.

వివరాల్లోకి వెళితే, మోనాల్ గజ్జర్ తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి అహ్మదాబాద్ నుండి ఉదయ్ పూర్ కి వెళ్ళింది, అక్కడ నుండి తిరిగి వస్తున్న సమయంలో హైవే ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బాగా దెబ్బతిన్నది.

యాక్సిడెంట్ జరిగిన తరువాత వారు ప్రయాణిస్తున్న కారుని చూస్తే, అందులో ఉన్న వారు ఎవరు బ్రతికే అవకాశం లేదు అన్న స్థాయిలో ఆ కారు ధ్వంసమైంది. దీనితో చాలా మంది ఈ ప్రమాదంలో మోనాల్ గజ్జర్ మృతిచెందినట్టుగా వార్తలు వచ్చేశాయి.

అయితే అవన్నీ ఒట్టి పుకార్లు అని చెబుతూ ఆమె తన సోషల్ మీడియా ద్వారా లైవ్ గా అభిమానులతో మాట్లాడి తన యోగక్షేమాలు తెలిపింది. ప్రమాదంలో తన మెడకి కాస్త దెబ్బ తగలడంతో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలిపింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS