ఓటీటీలో సినిమా ఇక ఫ్రీ కాదు!

By iQlikMovies - June 06, 2020 - 09:46 AM IST

మరిన్ని వార్తలు

స‌గ‌టు సినీ అభిమానుల‌కు క‌ల్ప‌త‌రువులా మారాయి ఓటీటీ వేదిక‌లు. అమేజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5, ఆహా, హాట్ స్టార్‌.. ఇలా ఎన్నో ఓటీటీ వేదిక‌లున్నాయి. వీటిలో వంద‌లాది సినిమాలు, వెబ్ సిరీస్‌లు. యేడాది స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే చాలు. రోజుకి రెండు మూడు సినిమాలు చూసేంత స్ట‌ఫ్ ఉంటుంది. లాక్ డౌన్ త‌ర‌వాత‌, థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ సినీ అభిమానుల‌కు ఓటీటీ వేదిక‌లే దిక్కులా మారాయి. ఓటీటీలో బ్రాండ్ న్యూ సినిమాలు చూపించ‌డానికి నిర్మాత‌లు కూడా స‌న్నాహాలు చేస్తున్నారు. ఇది వ‌ర‌కు థియేట‌ర్లో విడుద‌లైన త‌ర‌వాత ఓటీటీలోకి వ‌చ్చేవి. రాబోయే రోజుల్లో ప‌రిస్థితులు మారి, ముందు ఓటీటీ ఆ త‌ర‌వాతే థియేట‌ర్.. అనే మాట వినిపించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

 

అయితే.. ఓటీటీలో సినిమా చూడ‌డం ఇది వ‌ర‌క‌టిలా ఫ్రీ కాక‌పోవొచ్చు. డిమాండ్ బ‌ట్టి... ఓటీటీ సంస్థ‌లు క్యాష్ చేసుకోవ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. కొత్త సినిమాలు (థియేట‌ర్లో విడుద‌ల కానివి) ఓటీటీలో చూడాలంటే.. ఎంతో కొంత మొత్తం చెల్లించాల్సిన రోజులు రాబోతున్నాయి. ఇది వ‌ర‌కు ఒక‌రు స‌బ్‌స్క్రెబ్ తీసుకుంటే.. ఆ ఈమెయిల్ ఐడీ, పాస్ వ‌ర్డ్‌తో న‌లుగురు వ‌ర‌కూ చూసే అవ‌కాశం ఉండేది. ఇక మీద‌ట‌.. అలాంటి వెసులుబాటు ఉండ‌క‌పోవొచ్చు.

 

ఓటీటీ లో సినిమా చూసేవారి సంఖ్య పెంచుకుంటూ, వాళ్ల ద్వారా ఆదాయాన్ని సంవృద్ధి చేసుకునేలా ఓటీటీత వేదిక‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి. త్వ‌ర‌లోనే అమేజాన్ త‌న స‌బ్ స్క్రిప్ష‌న్ విష‌యంలో కొత్త నిబంధ‌న‌ల్ని ప‌రిచ‌యం చేసే అవ‌కాశాలున్నాయి. యేడాది స‌బ్ స్క్రిప్ష‌న్ తీసుకున్నా.. కొన్ని సినిమాలు చూడాలంటే మినిమం ఎమౌంట్ పే చేయాలి. అది కూడా వ‌న్ టైమ్ వాచ్ కోసం. ఇలాంటి ఇంకెన్ని నిబంధ‌ల్ని తీసుకొస్తారో మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS