మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్

నటీనటులు: సొహైల్, రూపా కొడువయుర్
దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి


నిర్మాతలు: అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి
 
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: నిజార్ షఫీ
కూర్పు: ప్రవీణ్ పూడి


బ్యానర్స్: మైక్ మూవీస్
విడుదల తేదీ: 18 ఆగష్టు 2023


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5
 

బిగ్ బాస్ తో వెలుగులోకి వచ్చాడు సోహెల్. ఇప్పటివరకూ కొన్ని సినిమా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏదిసరైన బ్రేక్ ఇవ్వలేదు. ఎస్వీ కృష్ణా రెడ్డితో చేసిన ఆర్గానిక్ మామ నిరాశ పరిచింది. ఇప్పుడు 'మిస్టర్‌ ప్రెగ్నెంట్‌' గా వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచింది. మగాడు గర్భాన్ని మోయడమా? ఈ ఐడియా ఎదో వెరైటీగా వుందే అనే ఆసక్తిని కలిగించింది. మరి ఈ చిత్రం సోహెల్ కోరుకునే విజయాన్ని ఇచ్చిందా? మగాడు గర్భం దాల్చే కాన్సప్ట్ తెరపై ఎలా సాగింది ? 


కథ: గౌతమ్(సోహెల్) ఓ టాటూ ఆర్టిస్టు.తను అనాధ.  ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం వుండదు.  తనని పెళ్లి చేసుకోవాలని వెంటపడుతుంది మహి(రూప). అనుకోని పరిస్థితుల్లో మహిని పెళ్లి చేసుకుంటాడు గౌతమ్. ఐతే పెళ్లి చెసుకుంటాడే కానీ పిల్లలు వద్దు అనే కండీషన్ పెడతాడు.  మహికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. ఆ విషయం గౌతమ్‌కు నచ్చదు.  ప్రెగ్నెన్సీ  విషయంలో గౌతంకి ఓ భయం వెంటాడుతూ వుంటుంది. దీంతో ఆమె గర్భాన్ని తాను తీసుకోవాలనుకుంటాడు. డాక్టర్ వసుధ(సుహాసిని) వైద్య పర్యవేక్షణలో ఆ గర్భాన్ని గౌతమ్ మోస్తాడు. ఆ తర్వాత ఏమైంది? గర్భాన్ని మోసిన గౌతమ్‌ను సమాజం ఎలా చూసింది ? అసలు గౌతం గతం ఏమిటి అనేది తక్కిన కథ. 


విశ్లేషణ: కొత్త దర్శకుడు శ్రీనివాస్ కొత్త పాయింట్ ని పట్టుకున్నాడు. ఐతే ఆ పాయింట్ ని కొత్తగా చెప్పడంలో తడబడ్డాడు. మగాడు గర్భం మోయడం అనేది ప్రక్రుతికి విరుద్దు. మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది చాలా సహజంగా చెప్పాల్సింది. కానీ ఈ కథని చెప్పడానికి అతను ఎంచుకున్న మార్గం రొటీన్ గా మారింది. సినిమా ఆరంభంలో వచ్చే టాటూ సన్నివేశాలు సాగదీతగా కథకు అడ్డుతగులుతాయి. ఈ సినిమాలో పాయింట్ ఏమిటో ట్రైలర్ లో ముందే చెప్పారు. ఆ పాయింట్ లోకి త్వరగా వెళ్లుంటే బ ఆవుండేది,. కానీ ఇంటర్వెల్ వరకూ అసలు పాయింట్ లోకి వెళ్ళకుండా కాలయాపన చేశారు. 


ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్ గా వుంటుంది, కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్క్ అవుట్ అయ్యాయి. ఐతే కథ ముందుకి వెళ్ళే కొద్ది  ప్రేక్షకులకు కంటే పాత్రలే ఎక్కువ ఎమోషనల్ అవుతుంటాయి. సహజంగా ఉండాల్సిన డ్రామా కాస్త ఓవర్ డ్రామా గా మారుతుంది. ఒక పాత్ర పెయిన్ ని చూస్తున్నపుడు ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. అంతేకానీ ఇక్కడ పాత్రలు మాత్రమే ఫీలౌతుంటాయి, దీంతో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ లోని అసలు మెసేజ్ ప్రేక్షకులకు సహజంగా కాకుండా కాస్త కుత్రిమంగా అందుతుంది.  


నటీనటులు: సోహెల్ నటన ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ. కథలో లోపాలు వున్నప్పటికీ తన పాత్ర వరకూ చక్కగా చేసుకుంటూ వెళ్ళాడు. గర్భంతో సోహెల్ నటించిన తీరు, భావోద్వేగ భరిత సన్నివేశాలు మెప్పిస్తాయి. మహి పాత్రలో రూప ఒదిగిపోయింది. డాక్టర్ వసుధగా సుహాసిని ఎప్పటిలాగే తన నటనను కనబర్చింది.   వైవా హర్ష,బ్రహ్మాజి ఫర్వాలేదనిపిస్తారు.


టెక్నికల్: శ్రావణ్ భరద్వాజ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బిలో యావరేజ్. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా వుండాల్సింది. మాటలు గుర్తుపెట్టుకునేలా వుండవు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తదే కానీ దాన్ని కనెక్టింగా చెప్పడంలో తడబాటు కనిపించింది. 

 

ప్లస్ పాయింట్స్ 

కాన్సప్ట్ 
సోహెల్ 
కొన్ని ఎమోషనల్ సీన్స్ 


మైనస్ పాయింట్స్ 

ఫస్ట్ హాఫ్ 
రొటీన్ ట్రీట్మెంట్ 
సహత్వం లేని సన్నివేశాలు 


ఫైనల్ వర్దిక్ట్ : మ్యాటర్ తగ్గింది మిస్టర్...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS