వాన, తూనీగ తూనీగ లాంటి క్లాస్ లవ్ స్టోరీలు తీసిన ఎం.ఎస్.రాజు.. దర్టీ హరీ లాంటి సినిమా తీస్తాడని అస్సలు ఊహించి ఉండరు. దర్టీ హరీలో రొమాన్స్ పాళ్లు చూస్తే అంతా షాక్ తింటారు. ఆ స్థాయిలో ఉంటాయి. ఆ షాకింగ్ ఎలిమెంటే ఆ సినిమాని హిట్ చేసింది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని రొమాన్స్ లో ముంచేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఎం.ఎస్.రాజు.
ఆయన దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. అదే... `7 డేస్ 6 నైట్స్`. ఇదో కొత్తతరం రొమాంటిక్ చిత్రమని ఎం.ఎస్.రాజు చెబుతున్నారు. ``దర్టీ హరీతో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఆసినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మీ అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఈచిత్రాన్నీ రూపొందిస్తున్నా. హైదరాబాద్, గోవా, అండమాన్ నికోబార్ దీవుల్లో చిత్రీకరణ జరుపుతాం`` అన్నారు.