కోవిడ్ తో సంగీత‌ ద‌ర్శ‌కుడు మృతి

మరిన్ని వార్తలు

ప్రముఖ సంగీత దర్శకులు కె ఎస్ చంద్ర శేఖర్ కోవిడ్‌ తో మరణించారు. య‌మ‌కింక‌రుడు, హంత‌కుడి వేట‌, ఆణిముత్యం, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి, భోళా శంక‌రుడు త‌దితర చిత్రాల‌కు స్వ‌ర‌క‌ర్త‌గా ప‌నిచేశారు. ఆల్ ఇండియా రేడియోలోనూ సేవ‌లు అందించారు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామము ... వీరికి భార్య ముగ్గురు కుమార్తెలు ... 1990 లో అల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేరి విశాఖపట్నం వాసులకు సుపరిచితులయ్యారు ...అల్లురామలింగయ్య చిత్రం ' బంట్రోతు భార్య ' తో నేపథ్యగాయకునిగా సినీరంగ ప్రవేశంచేసిన ఈయన సంగీతదర్శకులు చక్రవర్తి గారివద్ద 70 కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్ గా చేసారు.

 

తదుపరి రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు , హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా పనిచేసి గీతఆర్ట్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా నిర్మించిన ' యమకింకరుడు ' చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. బ్రహ్మముడి ( రజని తొలిచిత్రం ) , భానుచందర్ ' హంతకుడి వేట ' రాజేంద్ర ప్రసాద్ ' ఆణిముత్యం ' కోడి రామకృష్ణ ' ఉదయం ' మరియు ' అదిగో అల్లదిగో ' దాసరి గారి భోళాశంకరుడు ' , ' ఆత్మ బంధువులు , కంచి కామాక్షి ( తమిళ్ & హిందీ ) ఇలా దాదాపు 30 కి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు .


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS