తెలుగులో అగ్రగామి నిర్మాణ సంస్థగా రూపుదాల్చింది మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పుడు వాళ్ల చేతిలో భారీ సినిమాలున్నాయి. ఈ సంక్రాంతికి ఒక రోజు వ్యవధిలో రెండు సినిమాల్ని విడుదల చేసి రికార్డు సృష్టించిన మైత్రీ మూవీస్, రెండు సినిమాలద్వారా లాభాలు పొంది ఇంకో కొత్త రికార్డు సృష్టించింది.
ఇప్పుడు... బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. త్వరలోనే ఓ భారీ బాలీవుడ్ మూవీ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్‌ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇటీవల హరీష్ శంకర్ - సల్మాన్ ఖాన్ మధ్య కథా చర్చలు జరిగాయి. హరీష్ చెప్పిన కథకు సల్మాన్ ఓకే అన్నాడని టాక్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు.. ప్రభాస్ తో ఓ హిందీ సినిమా చేయాలని మైత్రీ భావిస్తోంది. అందు కోసం ఓ బాలీవుడ్ దర్శకుడితో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఓ టాలీవుడ్ దర్శకుడ్ని, బాలీవుడ్ హీరోతో ముడిపెట్టినట్టే, ఓ టాలీవుడ్ హీరోని తీసుకెళ్లి బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయాలన్నది ప్లాన్. అదే జరిగితే.. రెండు భారీ సినిమాలతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది.
ఇప్పటికే పుష్ప సినిమాతో మైత్రీ పేరు బాలీవుడ్ లో మార్మోగుతోంది. అక్కడ ఓ స్ట్రయిట్ సినిమా తీసి హిట్ కొడితే.. ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్టే.