హీరో అల్లరి నరేష్ త్వరలో 'నాంది' అనే విలక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ విధించక ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది.
జూన్ 30 అల్లరి నరేష్ బర్త్‌డే సందర్భంగా 'నాంది ఎఫ్ఐఆర్' (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు . 'నాంది' ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో, ఆందోళన నిండిన ముఖంతో జైలులో నగ్నంగా కూర్చొని ఉన్న అల్లరి నరేష్‌ను మనం చూశాం. ఆ పోస్టర్ చూస్తేనే ఇప్పటివరకూ చేయని ఒక అసాధారణ పాత్రను ఆయన చేస్తున్నాడని అర్థమైపోయింది.