జబర్దస్త్‌ యూటర్న్‌ తీసుకోనున్న మెగాబ్రదర్‌.?

మరిన్ని వార్తలు

జబర్దస్త్‌ అంటే నాగబాబు, నాగబాబు అంటే జబర్దస్త్‌ అనేలా ఆ షో పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. స్వచ్ఛమైన నవ్వుతో నవ్వుల నవాబుగా ఈ షోకి సరికొత్త అందం తీసుకొచ్చింది నాగబాబే. అయితే, ఇంటర్నల్‌గా ఏవో వివాదాలు చెలరేగి ఈ మధ్య ఈ షో నుండి నాగబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. నాగబాబు లేకుంటే, జబర్దస్త్‌ చూడడం దండగ.. అని మొదట్లో అనుకున్నారంతా. కానీ, నాగబాబు లేని లోటు పెద్దగా తెలియకుండా జబర్దస్త్‌ కామెడీ షోని నడిపిస్తున్నారన్న సంగతి ఇప్పటికీ ఈ షోని ఫాలో అవుతున్న వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

మరోవైపు జబర్దస్త్‌కి గుడ్‌బై చెప్పేసిన నాగబాబు, మరో ఛానెల్‌లో 'అదిరింది' అంటూ సొంత కుంపటి పెట్టేసిన సంగతీ విదితమే. అయితే, జబర్దస్త్‌కి 'అదిరింది'తో టోకరా వేయాలనుకున్న బాబుకి చుక్కెదురైంది. జబర్దస్త్‌ ఫాలోయింగ్‌ని డిస్ట్రాయ్‌ చేయడం వల్ల కాలేదు. సరికదా.. నెలలు గడుస్తున్నా, 'అదిరింది' ప్రోగ్రామ్‌ ఆశించిన క్రేజ్‌ సంపాదించుకోలేకపోతోంది. సో ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ నుండి అందుతున్న ఇన్‌ఫామేషన్‌ ప్రకారం, నాగబాబు జబర్దస్త్‌కి యూ టర్న్‌ తీసుకోవాలనుకుంటున్నారట. షో నుండి బయటికి వచ్చేటప్పుడు నాగబాబు జబర్దస్త్‌ రెమ్యునరేషన్‌ ముచ్చట కూడా విప్పి చెప్పారు. తన స్థాయికి తగ్గ రెమ్యునరేషన్‌ కాదని వాపోయారు. మరి, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న న్యూస్‌ నిజమైతే, రెమ్యునరేషన్‌ కూడా పాయింటే. సరె సర్లే అసలు నిజం తెలియాలంటే కొన్నాళ్లు నిదానంగా ఉండాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS