ఏంటి? ఎందుకు? ఈ ఇరగదీసేయడం అనుకుంటున్నారా? నాగచైతన్య - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'శైలజారెడ్డి అల్లుడు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో రెండు పాటల షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. ఈ రెండు పాటల్లోనూ చైతూ, అనూ డాన్సులు ఇరగదీసేశారట.
ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ఈ సినిమా డైరెక్టర్ అయిన మారుతి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని పాటలు రీసెంట్‌గా షూట్ చేశారు. ఈ పాటల్లో వీరిద్దరి డాన్సుల గురించే మారుతి మీడియాతో మాట్లాడారన్న మాట. అయితే డాన్స్ అంటున్నారు. చైతూ డాన్సుల సంగతి తెలిసిందే. అనూ ఇమ్మాన్యుయేల్ డాన్సుల్లో ఇంతవరకూ తనను తాను ప్రూవ్ చేసుకోలేదు. డాన్సుల్లో ఈ భామ వీక్ అనే చెప్పాలి. అలాంటిది ఈ ఇద్దరూ డాన్సులు ఇరగదీసేయడమేంటి అని ఆడియన్స్ అనుమానపడుతున్నారు.
అయితే ఆ అనుమానాలన్నీ ఈ సినిమాతో పటాపంచలైపోతాయని మారుతి అంటున్నాడు. ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'నా పేరు సూర్య' సినిమాలో 'ఇరగ ఇరగ..' అనే పాట చూశాం. ఈ పాటలో బన్నీ డాన్సులు ఇరగదీసిన మాట వాస్తవమే. కానీ అనూ ఇమ్మాన్యుయేల్ మాత్రం అలా అలా నడుస్తూ, అందాలారబోసిందే తప్ప, అస్సలు కాలు కదిపిందే లేదు. అయితే ఈ సినిమాలో చైతూ పక్కన డాన్సులు ఇరగదీసేయడమేంటో సినిమా విడుదలైతే కానీ తెలీదు.
ఇదిలా ఉంటే, చైతూ అతి త్వరలోనే 'సవ్యసాచి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.