మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న చైతు

మరిన్ని వార్తలు

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించి అందరికి షాకిచ్చారు. వారి డివోర్స్ కి కారణం ఇప్పటివరకు బయటపడలేదు. ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. అయినా కానీ పలుమార్లు చైతు , సామ్ కలిసిపోతున్నారు అన్న రూమర్లు వచ్చాయి. తరవాత సమంత పెళ్లి అని, నాగచైతన్య పెళ్లి అని రక రకాల వార్తలు వచ్చాయి. చాలా రోజులుగా నాగ చైతన్య, శోభితా దూళిపాళ డేటింగ్ లో ఉన్నారని, వీరిద్దరూ కలిసి టూర్లకు వెళ్లినట్లు ఫొటోస్ దర్శనమిచ్చాయి. 


దీనితో  చైతు, శోభిత పెళ్లి చేసుకుంటారని గత కొంత కాలంగా వినిపిస్తోంది. తరచు వీరి పెళ్లి వార్తలు హల్చల్ చేస్తున్నా ఇప్పుడేకంగా ఎంగేజ్ మెంట్ న్యూస్ తెరపైకి వచ్చింది. వీరిద్దరూ   త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని, ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్‌ వేడుకలు జరగనున్నాయని టాక్. నాగార్జున ఇంట్లోనే కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరుగుతున్నట్లు సమాచారం. అక్కినేని ఫ్యామిలీ ఎట్టకేలకి చైతు, శోభిత ప్రేమని అంగీకరించి, పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  


ఈ రోజు లేదా రేపు ఎంగేజ్‌మెంట్‌ జరగనున్నట్లు, వీరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొననున్నారని సమాచారం. ఈ విషయం పై అఫీషియల్ క్లారిటీ రాకపోయినా సోషల్ మీడియాలో వీరి ఫొటోస్, ఎంగేజ్ మెంట్ న్యూస్ వైరలవుతోంది.  మొత్తానికి చైతు కొత్తజీవితాన్ని మొదలుపెడుతున్నాడని ఫాన్స్ ఆనందపడుతున్నారు. మరి సామ్ సంగతేంటని ఆరా తీస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS