అక్కినేని నాగచైతన్య - సమంతల పెళ్లికి ముహూర్తం కుదిరిపోయిందంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. `అక్టోబరులో మా పెళ్లి` అంటూ నాగచైతన్య మీడియాకు చెప్పేశాడు. ఇప్పుడు డేట్ కూడా తెలిసిపోయింది. అక్టోబరు 6న సమంత - చైతూల పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి హైదరాబాద్ లోనా, గోవాలోనా అనే విషయంలపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. చైతూ హైదరాబాద్‌కే మొగ్గు చూపిస్తున్నాడట. సమంత మాత్రం గోవాలో జరిగితే బాగుంటుంది అంటోందట. పెళ్లి హిందూ, క్రైస్తవం.. ఇలా రెండు సంప్రదాయాల ప్రకారం జరగబోతోంది. అంటే.. రెండు పెళ్లిళ్లన్నమాట. పెళ్లి ఎక్కడైనా .. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లోనే గ్రాండ్ గా ఇవ్వాలని నాగ్ ఫిక్సయినట్టు సమాచారం.