చైతు - సమంత ల వివాహ తేదీ పై జరుగుతున్న చర్చకి నాగ చైతన్య తెరదించేసాడు.
ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రెస్ మీట్ సందర్భంగా విలేఖర్లు చైతు ని పెళ్లి డేట్ ఎప్పుడు అని ప్రశ్నించగా- అక్టోబర్ 6వ తేదిని ఖరారు చేసుకున్నట్టుగా తెలిపాడు. వీరి పెళ్ళికి సంబంధించి ఇదే అధికారిక ప్రకటనగా దాదాపు అనుకోవచ్చు. మొత్తానికి పెళ్లి తేది పైన క్లారిటీ రావడంతో, ఇక పెళ్లికి ఎటువంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయనేది మరి కొద్దీ రోజుల్లో తెలుస్తుంది.