నాగ చైతన్య, సమంతల వివాహం మహోత్సవం నేడే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల శుభాకాంక్షల జోరు కొనసాగుతోంది. అభిమానుల విషెస్‌తో సోషల్ మీడియా అంతా ధూం ధాం సందడి మొదలైంది. చై, శామ్ హ్యాష్ టాగ్‌తో అభిమానులు వెడ్డింగ్ విషెస్ తెలుపుతున్నారు. ఈ రోజు హిందూ సాంప్రదాయంలో ఈ ఇద్దరూ వివాహం చేసుకోనున్నారు. గోవా ఈ ముచ్చటకు వేదికైంది. రేపు అనగా శనివారం క్రిస్టియన్ సాంప్రదాయంలో వీరి పెళ్లి జరగనుంది. ఈ వేడుకకు నాగచైతన్య, సమంత ఇద్దరు తరపు నుండి అతి కొద్ది మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి కొడుకు దుస్తుల్లో నాగ చైతన్య ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నాగార్జున. ఈ ఫోటోలో నాగ చైతన్యతో పాటు నాగార్జున ఒక పక్క, మరో పక్క మేనమామ వేంకటేష్ ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. చైతన్య పెళ్లికొడుకు గెటప్‌లో ఉన్న ఫోటోని అభిమానులు పండగ చేసుకున్నారు. మరి ముద్దుగుమ్మ సమంత పెళ్లికూతురుగా ఏ గెటప్‌లో దర్శనమిస్తుందోనంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సమంతను వెడ్డింగ్ ఫోటోల్లో ఇప్పటికే చూసేశారు. స్పెషల్‌గా వెడ్డింగ్ వేర్లో సమంత ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ రోజు సమంత మేకప్ ఎలా ఉండబోతోందంటూ ఫ్యాన్స్ ఆశక్తిగా ఉన్నారు. మొత్తానికి సమంత, నాగ చైతన్యలిద్దరూ పెళ్లి ముడితో ఈ రోజు ఒక్కటి కానున్నారు.