నాగచైతన్య చేతిలో ఉన్న సినిమాలు చూస్తుంటే... షాక్ కొడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 ప్రాజెక్టులు ఓకే చేసుకున్నాడు చైతూ. ఇదివరకెప్పుడూ ఇలా జరగలేదు. ఎప్పుడూ సినిమా తరవాత సినిమా అంటూ.... ఆచి తూచి అడుగులేసేవాడు. ఇప్పుడైతే అలా కాదు. రెండేళ్లకు సరిపడా కథల్ని పక్కన పెట్టుకున్నాడు. అందులో.. ఓ యువ దర్శకుడు చెప్పిన కథ కూడా ఉంది.
లూజర్ అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నాడు అభిలాష్. జీ 5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌కి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఈ వెబ్ సిరీస్ చూసి, చాలామంది హీరోలు `కథలేమైనా చెప్పు.. చేద్దాం` అని ఆఫర్లు ఇచ్చారు. ఇప్పుడు చైతూ కోసం ఓ కథ రెడీ చేశాడట అభిలాష్. ఈమధ్యే చైతూ - అభిలాష్ మధ్య సిట్టింగ్ కూడా జరిగింది. చైతూ నుంచి గ్రీన్ సిగ్నల్ అందినట్టు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం `లవ్ స్టోరీ` సినిమాతో బిజీగా ఉన్నాడు చైతూ. ఆ వెంటనే విక్రమ్ కె.కుమార్ తో సినిమా ఉంది. 2021 చివర్లో అభిలాష్ తో సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది.