నాగశౌర్యకి వధువు కావాలి కానీ, వరుడేంటి? అనుకుంటున్నారా? అది సినిమా టైటిల్ అండీ. నాగశౌర్య సినిమాకి `వరుడు కావలెను` అనే టైటిల్ ఫిక్స్ చేశార్ట. అదీ మేటరు. సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీతూ వర్మ కథానాయిక. ఈ చిత్రానికి `వరుడు కావలెను` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. ఇదో క్లీన్ ఫ్యామిలీ డ్రామా. పెళ్లి నేపథ్యంలో సాగుతుంది. తనకు కాబోయే శ్రీమతి కోసం హీరో, కాబోయే భర్త కోసం హీరోయిన్ అన్వేషించుకోవడమే ఈ కథ.
ఇటీవలే... షూటింగ్ పునః ప్రారంభమైంది. విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్రబృందం ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతోంది. ఈ సినిమాలో నాగశౌర్య, రీతూల పాత్రలు రెండూ పోటా పోటీగా ఉంటాయని, ఇప్పటి వరకూ చూడని ఓ కొత్త పాయింట్ ని ఈ సినిమా ద్వారా సృశిస్తున్నారని తెలుస్తోంది. ఆ పాయింటేమిటో తెలియాలంటే... వరుడు బయటకు రావాల్సిందే.