నాగ శౌర్య , రీతువర్మ ల ‘వరుడు కావలెను‘ వీడియో విడుదల!

మరిన్ని వార్తలు

‘వరుడు కావలెను‘....!

వినగానే ఇది తమ అమ్మాయికి తగిన ‘వరుడు‘ కోసం ‘వధువు‘ తల్లి దండ్రులు పత్రికలలో ఇచ్చే ప్రకటన అనిపిస్తుంది. కానీ ఇది ఒక చిత్రం పేరు. మీరు వింటున్నది నిజమే.... ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను‘ అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ దీనికి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా విడుదల చేశారు.

 

ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపిస్తారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది. ‘వరుడు కావలెను‘ అనేపేరు చిత్ర కథ కు పూర్తిగా సరైనదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుపుతూ చిత్ర యూనిట్ తరపున ప్రేక్షకులకు, మీడియా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS