జబర్దస్త్‌కి నాగబాబు కౌంటర్‌ 'అదిరింది'

By iQlikMovies - December 12, 2019 - 09:54 AM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ ఛానెల్‌ ఈ టీవీలో గత కొన్నాళ్లుగా ప్రసారమవుతున్న నవ్వుల ప్రోగ్రామ్‌ 'జబర్దస్త్‌'కి మంచి పేరుంది. 'జబర్దస్త్‌' అంటే గుర్తొచ్చేది ముందుగా నవ్వుల నవాబు నాగబాబు. అలాగే, మరో హోస్ట్‌ రోజా. ఈ ఇద్దరూ ఇన్నేళ్లుగా ఈ షో విజయవంతంగా సాగడంలో ఎంతో కృషి చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఇటీవల నాగబాబు ఈ షో నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.

 

తాజాగా మన నవ్వుల నవాబు తన నవ్వుల పంటను మరో ఛానెల్‌లో పండించడానికి సిద్ధమైపోయారు. 'అదిరింది' అనే టైటిల్‌తో జీ తెలుగు ఛానెల్‌లో ఈ ప్రోగ్రామ్‌ ఈ నెల 15 నుండి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమో అందర్నీ ఆహ్లాదపరుస్తోంది. 'అందరూ వచ్చేశారుగా.. ఇంకేంటీ షో స్టార్ట్‌ చేసేయడమే.. అని ఓ వాయిస్‌ వినబడగా, ఎంతమంది ఉన్నారన్నది కాదు ముఖ్యం. ఎవ్వరున్నారన్నది ముఖ్యం..' అంటున్నప్పుడు 'అదిరింది' టైటిల్స్‌ పడడం.. నిజంగానే అదిరింది. అంతేకాదు, ఇన్‌డైరెక్ట్‌గా జబర్దస్త్‌కి నాగబాబు ఈ ప్రోమో ద్వారా కౌంటర్‌ ఇచ్చినట్లయ్యిందంటూ ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే, నాగబాబు సారధ్యంలో జబర్దస్త్‌ హండ్రెడ్‌ పర్సంట్‌ సక్సెస్‌ అయ్యింది. మరి అలాగే ఈ ప్రోగ్రామ్‌ కూడా సక్సెస్‌ అవుతుందా.? టైటిల్‌ అయితే క్యాచీగా ఉంది. కానీ, ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్‌ చేయబోయే కంటెస్టెంట్స్‌ ఎవరు.? స్కిట్స్‌ ఎలా ఉండబోతున్నాయి.? జబర్దస్త్‌లా ఈ షో కూడా సక్సెస్‌ అవుతుందా.? ఆడియన్స్‌ని ఆ రేంజ్‌లో ఎట్రాక్ట్‌ చేయగలగుతుందా.? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే, కొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS