నాగబాబు నిర్మాతగా కళ్యాణ్‌దేవ్‌ సినిమా?

మరిన్ని వార్తలు

మెగా అల్లుడు కళ్యాణ్‌దేవ్‌ సూపర్‌ ఫాస్ట్‌గా ఉన్నాడు. ఇంకా తొలి సినిమా 'విజేత' విడుదల కాకముందే తర్వాతి సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నాడు. వరుస సినిమాలు అంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. కొత్త దర్శకుడు రాకేష్‌ శశితో కళ్యాణ్‌దేవ్‌ తొలి సినిమా 'విజేత' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

కాగా కళ్యాణ్‌దేవ్‌ రెండో సినిమాపై కూడా ఆల్రెడీ ఓ క్లారిటీ ఉంది. పూర్తి వివరాలు తెలియవు కానీ, ఆ సినిమాకి 'వరప్రసాద్‌ గారి అల్లుడు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారంటూ గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కదా. అలాగే కళ్యాణ్‌దేవ్‌ రెండో సినిమా టైటిల్‌ విషయంలో వస్తున్న గాసిప్స్‌ని పూర్తిగా కొట్టి పారేయలేం. ఇక ముచ్చటగా మూడో సినిమా కూడా తాజాగా లైన్‌లోకి వచ్చింది. కళ్యాణ్‌దేవ్‌ మూడో సినిమాని మెగా బ్రదర్‌ నాగబాబు నిర్మించనున్నారట. 

అయితే పూర్తి స్థాయి నిర్మాతగా కాకుండా, ఇటీవల అల్లు అర్జున్‌ సినిమాకి నిర్మాణ భాగస్వామ్యం వహించినట్లుగా కళ్యాణ్‌దేవ్‌ సినిమాకీ నిర్మాణ భాగస్వామ్యం వహించనున్నాడట నాగబాబు. ఓ యంగ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడనీ తెలుస్తోంది. తొలి సినిమా 'విజేత'పై భారీ అంచనాలున్నాయి. 

మెగాస్టార్‌ అల్లుడు అని కాకపోయినా, కళ్యాణ్‌దేవ్‌లో మంచి విషయం ఉందనీ ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. తొలి సినిమాకి మెగాస్టార్‌ అల్లుడిగా పరిచయమైనా, తన సొంత టాలెంట్‌తో నటుడిగా ప్రూవ్‌ చేసుకోగల సత్తా ఉన్నోడేనని అంటున్నారు. చూడాలి మరి కళ్యాణ్‌దేవ్‌ స్టామినా ఎంతో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS