కృష్ణని తొందరపెడుతున్న నాగ్!

మరిన్ని వార్తలు

కింగ్ నాగార్జున కి స్టొరీ సెలెక్షన్ పైన ఎంత పట్టుఉంటుందో అతని కెరీర్ చూస్తేనే తెలుస్తుంది. అలా ఒక టెక్నీషియన్ టాలెంట్ అంచనా వేయడంలో కూడా ముందు ఉంటాడు. దానికి ఉదాహరణగా అతను లాంచ్ చేసిన డైరెక్టర్స్, యాక్టర్స్, హీరోయిన్స్ లిస్ట్ చూస్తే తెలుస్తుంది.

ఇక విషయానికి వస్తే, సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేసిన కళ్యాణ్ కృష్ణ పైన నాగార్జున ఒక విషమై తొందరపెడుతున్నట్టు తెలుస్తుంది. అదేంటంటే, కళ్యాణ్ ని త్వరగా తనతో బంగార్రాజు చిత్రం మొదలుపెట్టమని!

దీనికి కారణం, ఆయన ప్రస్తుతం సోలోగా ఏ చిత్రం కూడా ప్రారంభం కాకపోవడమే! అయితే కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా పూర్తిచేశాడు. ఇక ఈ చిత్రం మే నెలలో రిలీజ్ అయ్యాక బంగార్రాజు చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది.

మరి కళ్యాణ్ తనకి బ్రేక్ ఇచ్చిన నాగ్ కోసం బంగార్రాజు ని త్వరగా మొదలుపెడతాడో లేదో అనేది చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS