కింగ్ నాగార్జునకి 2016 సంవత్సరం బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశాయి.
ఆ సక్సెస్ కిక్ తోనే 2017ను కింగ్ సరికొత్తగా తన కొత్త చిత్రం ఓం నమో వేంకటేశాయతో వెల్కమ్ చెప్పబోతున్నాడు. అయితే ఈసారి తను తెలుగు హీరోలతో కాకుండా తమిళ హీరో సూర్యతో పోటికి సై అన్నాడు.
అందుతున్న సమాచారం ప్రకారం, నాగ్ సినిమా ఫిబ్రవరి 10న వస్తుంటే సూర్య సింగం-3 ఫిబ్రవరి 9న రిలీజ్ కి సిద్దం అవుతుంది. ఒకరకంగా ఈ రెండు చిత్రాల కధలు వేరు వేరు జానర్స్ కాబట్టి ఈ రెండు చిత్రాలకి ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి అని ట్రేడ్ వర్గాల అంచనా.
చూద్దాం.. ఏ చిత్రం ఎలా ఆడుతుందో??