'దేవదాస్‌' సీక్వెల్‌ చేయాలనుంది - నాగ్‌

మరిన్ని వార్తలు

'దేవదాస్‌' అంటే గుర్తొచ్చేది ఏఎన్నార్‌. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన కుమారుడు నాగార్జున అదే టైటిల్‌తో సినిమా చేయడం విశేషం. నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'దేవదాస్‌'. నాగ్‌ - నాని మల్టీ స్టారర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. యంగ్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడకకు హాజరయ్యారు. నాగార్జున ఈ ఫంక్షన్‌లో జోష్‌గా డాన్సులు చేసి అభిమానులకు బూస్టప్‌ ఇచ్చారు. నాన్నగారి సినిమా 'దేవదాస్‌'కి సీక్వెల్‌ చేయాలని ఉందని నాగార్జున ఈ సందర్భంగా తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు. తాజా 'దేవదాస్‌' చిత్రం గురించి మాట్లాడుతూ ఈ సినిమా కథ వినగానే నచ్చేసింది. అందులోనూ డాన్‌ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. డాక్టర్‌ దాస్‌ పాత్రలో నాని అయితే బావుంటుందని మొట్ట మొదట నేనే సూచించాను. నాని అంటే చాలా ఇష్టమనీ, నానితో సినిమా చేయాలన్న కోరిక ఇలా నెరవేరిందనీ, నాగార్జున చెప్పడం విశేషం. 

అలాగే హీరోయిన్‌ ఆకాంక్షసింగ్‌ని తెగ పొగిడేశారు నాగార్జున. సినిమాలో ఆకాంక్ష చాలా అందంగా ఉందనీ, చాలా రోజుల తర్వాత తన పక్కన అందమైన హీరోయిన్‌ అని ఆకాంక్ష సింగ్‌కి కితాబిచ్చేశారు నాగార్జున. ఇకపోతే సెప్టెంబర్‌ నెల మాకు బాగా కలిసొచ్చిన నెల అన్నారు. ఈ నెల్లో చైతూ 'శైలజారెడ్డి అల్లుడు' విడుదలైంది. సమంత 'యూటర్న్‌'కి మరచి రెస్పాన్స్‌ వచ్చింది. అఖిల్‌ కొత్త సినిమా 'మిస్టర్‌ మజ్ను' టీజర్‌ వచ్చింది. 

ఇక లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ అన్నట్లుగా నెలాఖరులో అనగా సెప్టెంబర్‌ 27న నాగార్జున 'దేవదాస్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలకు వస్తున్న రెస్పాన్స్‌తో అక్కినేని ఫ్యామిలీ ఖాతాలో 'దేవదాస్‌' మరో సూపర్‌హిట్‌ అవుతుందని భావిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS