ఏ సినిమాకైనా ప్రమోషన్లు చాలా కీలకం. అందుకోసం రకరకాల జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టి చేసే పబ్లిసిటీ కంటే, క్రియేటివిటీతో చేసే పబ్లిసిటీకే మైలేజీ ఎక్కువ. అయితే అందుకు తెలివితేటలు కావాలి. నాగార్జునకు ఆ తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. తాజాగా... `వైల్డ్ డాగ్` సినిమా ప్రమోషన్ల కోసం నాగ్ ఎంచుకున్న స్ట్రాటజీనే అందుకు నిదర్శనం.
నాగార్జున నటించిన చిత్రం `వైల్డ్ డాగ్`. త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ విడుదలైంది. చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరు, నాగ్ ల మధ్య వాట్సప్ చాటింగ్ జరిగింది. మరోవైపు ట్రైలర్ చూసి మహేష్ కూడా నాగార్జునకు వాట్సప్ చేసి.. తన విషెష్ చెప్పాడు. ఈరెండు వాట్సప్ చాటింగుల స్క్రీన్ షాట్స్ ని నాగార్జున సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ రకంగా మెగాస్టార్, సూపర్ స్టార్‌లనూ... పరోక్షంగా తన సినిమా పబ్లిసిటీకి తెలివిగా వాడుకున్నట్టైంది.