ఇప్పుడిప్పుడే ఫిలిం మేకర్లు షూటింగులకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకా షూటింగులు ప్రారంభం కాలేదు కానీ త్వరలోనే స్టూడియోలు అన్నీ షూటింగులతో కళకళలాడడం ఖాయమని అంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఇన్ డోర్ షూట్లకు రెడీ అవుతున్నారు కానీ హైదరాబాద్ బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదట. అయితే అక్కినేని నాగార్జున ఈ రిస్క్ తీసుకునేందుకు సై అన్నారని టాక్ వినిపిస్తోంది.
నాగార్జున ప్రస్తుతం అహిషోర్ సాలమన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' అనే ఓ పోలీస్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కొంత భాగం ముంబైలో చిత్రీకరణ జరిపారట. కథ ప్రకారం కొంత భాగం విదేశాలలో చిత్రీకరణ జరపాల్సి ఉంది. దానికి తగ్గట్టే చైనాలో ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారట. కానీ కరోనా క్రైసిస్ కారణంగా ఆ షెడ్యూల్ ను రద్దు చేసుకున్నారు. తాజాగా ఈ విదేశాల షెడ్యూల్ ను థాయ్ ల్యాండ్ లో చిత్రీకరించాలని 'వైల్డ్ డాగ్' టీమ్ డిసైడ్ అయ్యారట. నాగార్జున కూడా తనవైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తారట. ఒకవేళ ప్లాన్ చేసిన ప్రకారం థాయ్ ల్యాండ్ కు వెళ్లి షూట్ చేస్తే మిగతా ఫిలింమేకర్లకు, హీరోలకు ఇదో ప్రేరణగా నిలవడం ఖాయం.
ఈ సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈమధ్య నాగార్జున సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా నిరాశ పరుస్తున్నాయి. మరి ఈ సినిమాతో అయినా నాగార్జున భారీ హిట్ సాధిస్తారేమో వేచి చూడాలి.