హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సినిమా 'డీజె - దువ్వాడ జగన్నాధమ్'. ఈ సినిమాలో ఇటీవల విడుదలైన ఓ సాంగ్లో నమకం, చమకం అనే పవిత్రమైన పదాల్ని శృంగారం కోసం వాడారంటూ బ్రాహ్మణ సంఘాల అభ్యంతరంతో ఆ పదాల్ని తొలగించడానికి చిత్ర నిర్మాత అంగీకరించారు. ఈ వివాదంపై వివరణ ఇస్తామని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పాడు. అయితే వివాదాన్ని పెంచడం సబబు కాదని నిర్మాత దిల్ రాజు అనుకున్నారట. వివరణలతో వివాదం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారమ్. 'నమకం, చమకం' అనే పదాల్ని శృంగార గీతంలో వాడటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ అభ్యంతరం పెద్ద దుమారం కాకముందే నిర్మాత స్పందనతో ఆందోళనకారులూ వెనక్కి తగ్గారు. ఇంకో వైపున సినిమా ట్రైలర్ వచ్చింది. పవర్ఫుల్గా సినిమాని రూపొందించారనే విషయం అర్థమవుతోంది ట్రైలర్ చూస్తుంటే. భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు దిల్ రాజు - హరీష్ శంకర్ - బన్నీ ఈ కాంబినేషన్ అంటేనే అంచనాలు వెయ్యి వంతులున్నాయి. ఇక ట్రైలర్ వచ్చాక ఈ సినిమా విజయంపై అభిమానులు ఫిక్స్ అయిపోయారు.