ఆ గాసిప్‌ నమతకు నవ్వు తెప్పించిందట

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ నమిత గ్లామరస్‌ తారగా తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో ఇక్కడ ఈ బ్యూటీకి గుర్తింపు దక్కకపోవడంతో తమిళంలో ఛాన్సెస్‌ వెతుక్కుంది. అక్కడికెళ్లాక నమిత కొంచెం బొద్దుగా మారింది. బొద్దుగా ఉన్న సౌందర్యానికి తమిళ తంబీలు ఎక్కువ కిక్కు ఫీలవుతారు. దాంతో నమితకు బ్రహ్మరధం పట్టేశారక్కడ. దాంతో నమిత తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇదంతా సరే. ఈ ముద్దుగుమ్మపై తాజాగా ఓ రూమర్‌ చక్కర్లు కొడుతోంది. సీనయర్‌ హీరో శరత్‌ బాబును నమిత పెళ్లి చేసుకోబోతోందట.. అని. ఆ గాసిప్‌కి ఆమె ఫ్యాన్స్‌ షాక్‌ తిన్నారు. అయితే ఆ గాసిప్‌ వచ్చిన రోజే నమితకి తెలిసిందట. అది వినగానే నవ్వొచ్చిందట నమితకి. అయితే ఇలాంటి గాసిప్స్‌ని పట్టించుకునే అవసరం లేదనీ వదిలేసిందట. కానీ ఆ గాసిప్‌ అంతటితో ఆగడం లేదనీ, తాను స్పందించకపోతే ఫ్యాన్స్‌ అది నిజమనుకునే అవకాశాలున్నాయనీ ఈ ముద్దుగుమ్మ స్పందించింది. 'ఆయన వయసేంటి, నా వయసేంటి. అసలింత వరకూ శరత్‌బాబును నేను కలిసిందే లేదు.. ఈ గాసిప్‌లో ఎంత మాత్రమూ వాస్తవం లేదనీ..' నమిత చెప్పింది. అలాగే సీనియర్‌ నటులంటే తనకెంతో గౌరవం ఉందనీ, సెలబ్రిటీస్‌ మీద గాసిప్స్‌ కామనే. కానీ ఇలా రీజన్‌ లేని గాసిప్స్‌ని స్ప్రెడ్‌ చేయొద్దని నమిత చెప్పింది. అలాగే పెళ్లి విషయంలోనూ ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన తనకి లేదనీ, పెళ్లి విషయం వస్తే ఖచ్చితంగా తానే స్వయంగా చెబుతాననీ, ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్‌పైనే ఉందనీ నమిత చెప్పుకొచ్చింది. చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ షెడ్యూల్స్‌తో కెరీర్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నానంది బొద్దుగుమ్మ నమిత.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS