నాగబాబు చేసిన రచ్చకి మెగాప్రిన్స్‌ని తొక్కేస్తారా.?

మరిన్ని వార్తలు

ఇటీవల నందమూరి హీరో బాలయ్యపై మెగా బ్రదర్‌ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సోషల్‌మీడియాలో ఈ విషయమై రచ్చ జరుగుతోంది. అర్ధం పర్ధం లేని చెత్త డిస్కషన్స్‌కి సోషల్‌ మీడియానే వేదిక. సినిమా వేరు. ఇలాంటి అర్ధం పర్ధం లేని వివాదాలు వేరు. ఇప్పుడు యంగ్‌ హీరోలు ఒకరితో ఒకరు మిక్కిలి స్నేహంగా ఉంటున్నారు. మెగా ఫ్యాన్స్‌కీ, నందమూరి ఫ్యాన్స్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ఒకప్పుడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

ఏకంగా ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. అలా నందమూరి అభిమానులు, మెగా అభిమానులు ఒక్కటైపోయారు. నాగబాబు వివాదాన్ని విడిగానే చూడాలంటున్నారు చాలామంది. వాస్తవానికి సినిమా ఫ్లాప్‌ అయితే వరుణ్‌తేజ్‌కి వచ్చే నష్టమేమీ లేదు. ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌ పాడైపోతారు. మినిమమ్‌ లాజిక్‌ లేకుండా 'అంతరిక్షం' సినిమాని తొక్కేస్తాం. నాగబాబుకు మా పవరేంటో చూపిస్తాం.. అంటూ నందమూరి అభిమానుల పేరిట ఎవరెన్ని కామెంట్స్‌ చేసినా అది హాస్యాస్పదమే అవుతుంది.

ఇక అంతరిక్షం సినిమా విషయానికి వస్తే, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిష్‌ నిర్మాణ భాగస్వామ్యం వహించారు. మరోవైపు ఆలోచిస్తే క్రిష్‌, బాలయ్య మంచి స్నేహితులు. 'గౌతమీ పుత్ర శాతకర్ణి'తో సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చాడు బాలయ్యకు క్రిష్‌. తాజాగా క్రిష్‌ దర్శకత్వంలోనే 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో నటిస్తున్నాడు. సో ఈ వివాదం వరుణ్‌ తేజ్‌ సినిమాకి ఎఫెక్ట్‌ అవుతుందనడంలో అసలు అర్ధమే లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS