ప్రముఖ సినీ దర్శకురాలు అయిన నందిని రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఒక అవార్డు వరించింది.
ఆ వివరాల్లోకి వెళితే, ఈ నెల మార్చ్ 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో తమ తమ ప్రత్యేకత చాటుకున్న మహిళలకి ప్రత్యేక పురస్కారాలని తెలంగాణ ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఒక కమిటీ ఈ అవార్డులని ప్రకటించింది.
అందులో సినిమా రంగంలో నందిని రెడ్డికి ఈ పురస్కారం లభించింది అలాగే సంగీత విభాగంలో గాయని నిత్య సంతోషిణికి లభించింది. ఈ అవార్డులని ఈ నెల 8న బహుకరించనున్నారు.
ఈ అవార్డు క్రింద తెలంగాణ ప్రభుత్వం 1 లక్ష రూపాయల నగదు ఇచ్చి సత్కరించనుంది.