థియేటర్ల కోసం వేచి చూసీ చూసీ అలసిపోయిన సినిమాలు ఇప్పుడు మెల్లమెల్లగా ఓటీటీ బాట పడుతున్నాయి. అందులో భాగంగా `వి` సినిమాని అమేజాన్ కి అమ్మేసినట్టు వార్తలు వచ్చాయి. అమేజాన్ తో 33 కోట్ల బేరం కుదిరిందని, సెప్టెంబరు 5న ఈ సినిమా స్ట్రీమింగ్ లో ఉంటుందన్నది వార్తల సారాంశం. అయితే అమేజాన్ తో అమ్మకం నిర్మాత దిల్ రాజుకు అంత ఈజీగా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇందులో ఇద్దరు హీరోలున్నారు. అందులో నాని అమేజాన్ అమ్మకానికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
నిన్నా మొన్నటి దాకా.. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కూడా `నా సినిమా థియేటర్లలోనే చూడాలి` అని పట్టుపట్టుకుని కూర్చున్నార్ట. మరోవైపు దిల్ రాజు.. బయ్యర్లకు ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. దిల్ రాజు సినిమాల్ని రెగ్యులర్ గా కొనే బయ్యర్లు ఉన్నారు. వాళ్లతో `వి` బేరాలు ఎప్పుడో అయిపోయాయి. ఒకవేళ ఈ సినిమాని అమేజాన్ కి అమ్మాలంటే.. దిల్ రాజు వాళ్లని ఒప్పించాల్సిందే. ప్రస్తుతం... బయ్యర్లని ఒప్పించే పనిలో ఉన్నార్ట దిల్ రాజు. ముందు ఓటీటీ విడుదలకు వ్యతిరేకించిన నాని.. ఇప్పుడు దిల్ రాజు ఇష్టానికే వదిలేసినట్టు టాక్. ''అమేజాన్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే అవేమీ ఓ కొలిక్కి రాలేదు. బయ్యర్లతో దిల్ రాజు మంతనాలు జరుపుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది'' అని దిల్ రాజు కాంపౌండ్ వర్గాలు తెలియజేశాయి.