నేచురల్ స్టార్ నాని ఇంతవరకూ చాలా మంది హీరోయిన్స్‌తో పని చేశాడు. కానీ వారందరిలోకెల్లా కీర్తి సురేష్ వెరీ వెరీ స్పెషల్ అట. ఎందుకంటే కీర్తి సురేష్ నటిస్తున్నప్పుడు ఏదో డైరెక్టర్ చెప్పేశాడు. నేను నటించేశాను అన్నట్లుగా కాకుండా, ఆమె తన పాత్రపై కొంత అవగాహనతో ఉంటుందట. ఆ అవగాహనతోనే తన సీన్స్‌లో నటిస్తున్నప్పుడు, ఈ సీన్ ఇలా అయితే ఇంకా బాగుంటుంది..అంటూ డైరెక్టర్‌కి సూచనలిచ్చి, డైరెక్టర్ మెప్పు పొందుతుందట. తన పాత్రలో చాలా ఇంప్రూవ్‌మెంట్స్ వస్తాయట ఆ కారణంగా. అందుకే నానికి కీర్తిలోని ఈ క్వాలిటీ బాగా నచ్చిందంటున్నాడు. నాని కేవలం నటుడే కాదు. పలు చిత్రాలకు దర్శకత్వ విభాగంలో కూడా పని చేశాడు. ఆ అనుభవంతోనే కీర్తి సురేష్‌కి సర్టిఫికెట్ ఇచ్చినట్లున్నాడు నాని. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'నేను లోకల్'. ఈ సినిమాకి కీర్తి ప్రధాన ఆకర్షణ. ఆమె కారణంగా చాలా సీన్లు అనుకున్న దాని కన్నా చాలా బాగా వచ్చాయంటున్నాడు నాని. అంతేకాదు కీర్తి సురేష్ కూడా ఆషామాషీ ఏమీ కాదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన నటే. అందుకే ఆమె తన యాక్టింగ్ టాలెంట్‌ని అంతగా ప్రదర్శిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. నానితో మెప్పు పొందిన ఈ ముద్దుగుమ్మ తదుపరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేయనుంది. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మే హీరోయిన్.