హీరో నాని-హీరో అఖిల్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతున్నది అని సమాచారం.
తెలుస్తున్న సమాచారం ప్రకారం, నాని కొత్త చిత్రం MCAని డిసెంబర్ 22వ తేదీన విడుదల చేసేందుకు ముందు ప్లాన్ చేసారట. అయితే ఇప్పటికే అఖిల్ ‘హలో’ చిత్రం కూడా డిసెంబర్ 22న విడుదల అవుతున్నది అంటూ అఖిల్ ఇప్పటికే ప్రకటించేశాడు.
దీనితో వీరి మధ్య బాక్స్ ఆఫీస్ వార్ తప్పదు అన్న నేపధ్యంలో నాని వెనక్కి తగ్గాడట! ఒకేరోజు రెండు పెద్ద చిత్రాలు విడుదల అయితే ఇరువురికి ఇబ్బంది అన్న నేపధ్యంలో నాని MCA చిత్రం ఒక వారం ముందుకి అనగా డిసెంబర్ 15వ తేదిన విడుదలకి ఒకే చేశారట.
ఈ నిర్ణయంతో ఈ ఇద్దరు హీరోల బాక్స్ ఆఫీస్ వార్ కి తెరపడినట్టయింది.