నాని మిడిల్‌ క్లాస్‌ తడాఖా

మరిన్ని వార్తలు

మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా నాని తన తడాఖా చూపించేయనున్నాడు. ట్రైలర్‌తోనే చాలా చెప్పేశాడు. తాజాగా నాని హీరోగా నటిస్తున్న 'ఎంసీఏ' సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. 

'ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు మేల్కోవడం కాదు. సమస్యను ముందుగానే ఊహించి ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాం.. ఎందుకంటే మేం మిడిల్‌ క్లాస్‌ కాబట్టి..' అంటూ నాని చెపుతున్న డైలాగ్‌ ఒక్క మిడిల్‌ క్లాస్‌ వాళ్లనే కాదు, అందర్నీ టచ్‌ చేస్తోంది. ట్రైలర్‌ వచ్చాక సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. నానికి ప్రస్తుతం తిరుగే లేదు. విజయాలతో దూసుకెళ్లిపోతున్నాడు. 

ఇక మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలాంటి కాన్సెప్ట్‌తో నాని ఇంకెంత జోరు ప్రదర్శించనున్నాడో ట్రైలర్‌ చూస్తూ అర్ధమైపోతోంది. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత సీనియర్‌ నటి భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. నానికి వదిన పాత్రలో నటిస్తోంది భూమిక. ఈ ఇద్దరి మధ్యా సాగే వినోదం, సెంటిమెంట్‌ సినిమాకి హైలైట్‌ కానున్నాయట. ఇకపోతే ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తోంది 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది. 

తొలి సినిమాతోనే మాయ చేసేసింది. ఇండస్ట్రీ దృష్టిని అమాంతం తన వైపు తిప్పేసుకుంది. ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు రెడీ అయిపోతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్‌ కొత్తగా ఉండనుంది. హీరోయిన్‌ వెనక హీరో పడడం కామనే. బట్‌ ఈ సినిమాలో చిన్న ఛేంజ్‌. ఎప్పుడు పెళ్లి చేసుకుందామంటూ హీరోయిన్‌, హీరో వెనక పడుతోంది. ఆ క్యారెక్టర్‌లో సాయి పల్లవి ప్రాణం పెట్టేసేలా కనిపిస్తోంది ట్రైలర్‌ చూస్తుంటే. డిశంబర్‌ 21న 'ఎంసీఏ' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రిస్‌మస్‌, సంక్రాంతి పండగలంటే మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌కి వెరీ వెరీ స్పెషల్‌. ఆ స్పెషల్‌ సీజన్‌లో 'ఎంసీఏ' వంటి సినిమా రావడం నిజంగా స్పెషలే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS