నాని నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం `మీట్ - క్యూట్`. దీప్తి గంటా ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో అయిదుగురు హీరోయిన్లుంటారు. వాళ్లెవరన్నది చిత్రబృందం ఇప్పటి వరకూ చెప్పలేదు. అయితే ఇందులో ఓ కథానాయికగా ఆదాశర్మని ఎంచుకున్నట్టు సమాచారం.
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించింది ఆదా. ఆ తరవాత.. ఆమె జాడే లేదు. ఎట్టకేలకు మళ్లీ తెలుగులో మెరవబోతోంది. మరో కథానాయికగా రుహానీ శర్మ (చిలసౌ ఫేమ్) నటిస్తోంది. మరో ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలియాల్సివుంది. ఈ ముగ్గురిలో ఒకరు స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్సుంది. సత్యరాజ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. యువ కథానాయకుడు... శివ కందుకూరి కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.