ఈమధ్య హీరోలు రూటు మార్చారు. ఫ్లాపులొచ్చినా పారితోషికం తగ్గించడం లేదు. సరికదా.. పెంచుకుంటూ పోతున్నారు. శాటిలైట్, డిజిటల్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకోవడం, పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడంతో... హీరోల మాటే చెల్లుబాటు అవుతోంది. ఇప్పుడు నానినే తీసుకోండి.. నిన్నా మొన్నటి వరకూ తన పారితోషికం రూ.9 కోట్లు. నానికి 9 కోట్లు ఇవ్వడం సమంజసమే. ఎందుకంటే తనకున్న మార్కెట్ అలాంటిది.
కాకపోతే.. ఈమధ్య నాని సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. వి, టక్ జగదీష్ సినిమాలు దారుణంగా బెడసికొట్టాయి. `శ్యామ్ సింగరాయ్` బాగున్నా, ఆర్థికంగా లాభాల్ని అందుకోలేదు. అయినా సరే... నాని తన పారితోషికం తగ్గించలేదు. `అంటే సురందానికీ..` కోసం ఏకంగా రూ.15 కోట్లు అందుకున్నాడట. అంది కూడా రిలీజ్‌కి ముందే. మిగిలిన సినిమాలతో పోలిస్తే అంటే సుందరానికి పరిమిత బడ్జెట్ లోనే తీశారు. దానికి మంచి టాక్ వచ్చింది. వేసవి సీజన్ కాబట్టి.. మంచి వసూళ్లు దక్కే అవకాశం కూడా ఉంది. అందుకే నాని పారితోషికం విషయంలో రాజీ పడలేదని తెలుస్తోంది. నాని కొత్త సినిమా `దసరా`. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా రూ.60 కోట్లని టాక్. మరి ఈ సినిమాని ఎంత తీసుకుంటున్నాడో?