Ante Sundaraniki: బాక్సాఫీసు లెక్కలు వద్దంటున్న నాని

మరిన్ని వార్తలు

సినిమా సక్సెస్ మీట్ లో బాక్సాఫీసు లెక్కలు చెబుతారు. ఇంత కలెక్ట్ చేసింది అంత గ్రాస్ అని గొప్పగా ప్రకటిస్తారు. కానీ హీరో నాని మాత్రం అంటే సుందరానికీ బాక్సాఫీసు లెక్కలు జోలికి పోలేదు. ఈ రోజు నిర్వహించిన సక్సెస్ మీట్ లో మాట్లాడిన నాని.. 'అంటే సుందరానికీ' బ్లాక్ బస్టర్ , అయితే ఈ సెలబ్రేషన్ బాక్సాఫీసు నెంబర్లది కాదు..ప్రేక్షకుల హృదయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమాకి దక్కిన ప్రేమని, ప్రేక్షకుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.

 

బ్లాక్ బస్టర్ అనేది సమయం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో 'అంటే సుందరానికీ' ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఇది అవకాయ్ లాంటి సినిమా. మూడు రోజులు రుచి చూసారంటే రోజురోజుకి ఊరుతుంది. రుచి ఇంకా పెరుగుతుంది'' అని ముక్తాయించారు నాని. అటు మైత్రీ నిర్మాత నవీన్ కూడా ఈ సినిమా కలెక్షన్ జోలికి పోకపోవడం గమనార్హం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS