నేచురల్ స్టార్ నాని హ్యాట్రిక్ కొట్టనున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అనే మూవీతో వస్తున్నాడు. ఈ మూవీ పేరు తోనే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఇంతక ముందు వీరి కాంబోలో అంటే సుందరానికి అన్న మూవీ వచ్చింది. సరిపోదా శనివారంలో నానికి జోడి గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇందులో ఎస్ జె సూర్య పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు.
టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన మేకర్స్, ఈ రోజు నాని పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేసారు. గ్లింప్స్ లో SJ సూర్య వాయిస్ తో కోపాలు రకరకాలు, ఒక్కో మనిషికి కోపం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. పేరు.. సూర్య, ఆ రోజు శనివారం అని పవర్ ఫుల్ మాటల్తో గ్లింప్స్ స్టార్ట్ చేశారు. ఈ గ్లింప్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆసక్తిగా సాగింది. ఈ గ్లింప్స్ వలన ఈ మూవీ మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిందని తెలుస్తుంది. టోటల్ గా దసరా సినిమాని తలపిస్తోంది.
సినిమా మీద ఉన్న అంచనాలు గ్లింప్స్ తో ఒక్కసారిగా పెరిగిపోయాయి. గ్లింప్స్ లో జేక్స్ బిజోయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించింది, ఓవరాల్ గా గ్లింప్స్ సినిమా మీద ఉన్న అంచనాలను పెంచడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇదే రేంజ్ లో మెప్పిస్తే నాని ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ సొంతం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 29న వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో రిలీజ్ కాబోతుంది. DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.