నాని అంటేనే ఎంటర్టైనర్. తన సినిమాలు సరదాగా చూసి, హాయిగా నవ్వుకుని, తిరిగి ఇంటికి వచ్చేసేలా ఉంటాయి. సీరియస్ కథలు తనకేమాత్రం సూటవ్వవు. దానికి `వి`, `టక్ జగదీష్` సినిమాలే సాక్ష్యం. ఇవి రెండూ సీరియస్ గా సాగే సినిమాలే. కథలు, పాత్రలు బాగుంటాయి. కాకపోతే.. నాని చేయదగిన సినిమా కాదు. నాని ఏదో కామెడీ చేసి, నవ్విస్తాడనుకుంటే.. అవి కాస్త సీరియస్ గా సాగిపోయాయి. అందుకే అవి ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ తో కూడా అదే తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తోంది.
రాహుల్ సంకృత్యయిన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈనెల 24న విడుదల అవుతోంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు బాగున్నాయి.కాకపోతే... వాటిలో నాని సీరియస్ లుక్స్ లోనే కనిపిస్తున్నాడు. ఇదో సీరియస్ ఎమోషనల్ డ్రామా అనే సంగతి టైటిల్, స్టిల్స్ చెప్పేస్తున్నాయి. నాని కొత్తగా ఏదో ట్రై చేద్దామని ఫిక్సయ్యాడు. అంత వరకూ బాగానే ఉంది.కాకపోతే... నాని మళ్లీ కామెడీకి దూరం అయ్యాడేమో అనే డౌటు కొడుతోంది. నాని నుంచి ఆశించేది అదే. నాని మంచి నటుడు. కాకపోతే.. తనకు సీరియస్ ఎమోషన్ సూటవ్వదు. తన వయసుకి మించిన పాత్ర చేస్తే.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరు. శ్యామ్ సింగరాయ్ లోనూ అదే జరిగిందనిపిస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.