నేచురల్ స్టార్ నానితో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ నుండి, పక్కాగా లాభాలే అనేంతగా వరుస హిట్స్‌తో దూసుకెళ్లిపోయాడు ఈ మధ్య నాని. అయితే నాని స్పీడుకు 'కృష్ణార్జున యుధ్దం'తో బ్రేకులు పడ్డాయి. ఆ బ్రేక్‌కి 'దేవదాస్' సినిమా కూడా వేగం అందివ్వలేదు. అయితే వచ్చే ఏడాది నాని ఖాతాలో ఏకంగా మూడు సినిమాలు వచ్చి చేరాయి. ఆల్రెడీ 'జెర్సీ' సినిమాలో నటిస్తున్నాడు నాని. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా స్పోర్ట్ నేపథ్యంలో రూపొందుతోంది. ఆల్రెడీ సెట్స్‌పై ఉందీ సినిమా.
ఇదిలా ఉంటే, విక్రమ్ కుమార్, నాని కోసం ఓ మాంచి స్క్రిప్టు తయారు చేసి సిద్ధంగా ఉంచాడు. అది కూడా రేపో మాపో సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా నాని ఖాతాలో మరో సినిమా చేరింది. నానిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని సెకండ్ మూవీ 'జెంటిల్మెన్' సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మూడోసారి ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోందనీ తాజాగా అందుతోన్న సమాచారమ్.
ఈ సినిమాకి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారట. దిల్‌రాజు - నాని కాంబోలో రెండు బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. అలా ఈ ముగ్గురూ కలిసి బ్లాక్ బస్టర్పై కన్నేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడి కానున్నాయట. ఈ ఏడాది 'బిగ్‌బాస్' హోస్ట్‌గా బుల్లితెరపై కూడా నాని సందడి చేశాడు. మొత్తానికి వచ్చే ఏడాది వెండితెరపై చేతినిండా సినిమాలతో నాని ఫుల్ స్వింగ్ మీదున్నట్లు తెలుస్తోంది.