నాని తాజాగా 'ఎంసీఏ' సినిమాతో వస్తున్నాడు. ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అని అర్థం. టైటిల్ సంగతి తర్వాత, ముందు హీరో నాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నాని ఎప్పుడూ నేల విడిచి సాము చెయ్యడు. అదే అతని ప్రత్యేకత. ఏ సినిమా చేసినా అందులో పక్కింటి కుర్రాడిగానే కన్పిస్తాడు. అందుకే ఎన్ని సార్లు చూసినా, వెంట వెంటనే చూసినా అస్సలు బోర్ కొట్టడు. బహుశా అదే నాని సక్సెస్ సీక్రెట్ కావొచ్చు. స్టార్ డమ్‌ని దరిచేరనివ్వలేదు, అందుకే నేచురల్ స్టార్ నాని అయ్యాడు. ఏడాదిలో ఒక్క సినిమా కాదు. రెండు, మూడు లేదా నాలుగు సినిమాలతో వచ్చినా నాని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్ని సార్లు వచ్చినా నానికి హిట్ కట్టబెట్టే పంపిస్తారు ఆడియన్స్. ఎట్ ఏ టైమ్ రెండు మూడు సినిమాల్లో నటించేస్తూ ఉంటాడు. తాజాగా 'ఎంసీఏ'తోపాటు, 'కృష్ణార్జున' అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. 'కృష్ణార్జున' సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నాని. నానిని ఒక్కసారి స్క్రీన్‌పై చూస్తేనే జనానికి ఎంతో రిలీఫ్. ఇక డబుల్ ధమాకా అంటే నాని పంచే ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉండబోతోందో మాటల్లో చెప్పలేం. అదేదో సినిమాలో రాజమౌళి చెప్పినట్లు ఎంత స్ట్రెస్‌లో ఉన్నా నాని పెద్ద రిలీఫ్ అన్నట్లుగా, నిజమే ఎంత స్ట్రెస్‌లో ఉన్నా నాని సినిమా చూస్తే ఇట్టే రిలీఫ్ లభిస్తుంది. ఇటీవలే 'నిన్ను కోరి' సినిమాతో వచ్చాడు నాని. ఇప్పుడు 'ఎంసీఏ'తో రాబోతున్నాడు. మరో పక్క నాగార్జునతో కలిసి నాని ఓ మల్టీస్టారర్ సినిమాలోనూ కనిపించబోతున్నాడు.