కండలు కరిగిస్తోన్న నారా వారి హీరో

మరిన్ని వార్తలు

నారా రోహిత్‌ వరుస పెట్టి సినిమాలు చేసేస్తూ ఉంటాడు. సినిమా సినిమాకి ఏదో వైవిధ్యం చూపిస్తూ ఉంటాడు కథల పరంగా. అయితే బాడీ ఫిజిక్‌ పరంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాడు. గ్యాప్‌ లేకుండా సినిమాలు చేయడం వల్ల నారా రోహిత్‌కి ఆ అవకాశం కుదరడం లేదు. ఎప్పటికప్పుడే ఒళ్లు తగ్గించే ప్రయత్నాలు చేద్దామనుకున్నా అవి సక్సెస్‌ కావడం లేదు. ఎప్పట్నుంచో సిక్స్‌ ప్యాక్‌ చేస్తానంటున్నాడు కానీ వల్ల కావడం లేదు. అయితే ఈ సారి పక్కా అంటున్నాడు ఈ నారా వారి బుల్లోడు. ఇటీవలే 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్‌ హీరో కాకపోయినా, చాలా కీలకపాత్రలో నటించాడు. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నారా రోహిత్‌ అందర్నీ బాగా ఆకట్టుకున్నాడు. రోహిత్‌ పాత్ర సినిమా సక్సెస్‌కి చాలా దోహదం చేసింది. అందుకే ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో ఈ సారి కొంచెం గ్యాప్‌ తీసుకుని అయినా సరే ఫిజిక్‌ మీద కాన్‌సన్‌ట్రేషన్‌ చేద్దామనుకుంటున్నాడట నారా రోహిత్‌. అందుకోసం మనోడు కొంచెం గట్టిగానే కష్టపడతూ వర్కవుట్లు మొదలెట్టేశాడట కూడా. ప్రస్తుతం నారా రోహిత్‌ నుండి మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సారి రాబోయే సినిమాల్లో రోహిత్‌ తన ఫ్యాన్స్‌కి సిక్స్‌ ప్యాక్‌ బాడీతో, మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తానని హామీ ఇస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS