నరేష్ వైవాహిక జీవితంపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నరేష్ భార్య రమ్య.. నరేష్ పై ఆరోపణలు చేయడం, నరేష్ కూడా అంతే ధీటుగా స్పందించడం తెలిసిన విషయాలే. ఈ వ్యవహారంలో పవిత్ర లోకేష్ పేరు కూడా లింక్ అవ్వడంతో.. ఈ ఎపిసోడ్ మొత్తం ట్రయాంగిల్ స్టోరీలా నడుస్తోంది.
భార్య ఉండగానే, పవిత్ర లోకేష్‌తో సహ జీవనం చేస్తున్నారన్నది రమ్య ఆరోపణ. అయితే నరేష్ గానీ, పవిత్ర గానీ.. తమది `ఫ్రెండ్ షిప్` అనే అంటున్నారు. అయితే తాజాగా మైసూర్‌లోని ఓ హోటెల్ లో నరేష్, పవిత్ర ఒకే రూమ్‌లో ఉంటుండగా రమ్య అటాక్ చేశారు. పోలీసుల్ని, మీడియానీ హోటెల్ దగ్గరకు తీసుకెళ్లి రచ్చ రచ్చ చేశారు. `వీరిద్దరిదీ అక్రమ సంబంధమే..` అని నిరూపించే ప్రయత్నం చేశారు. ఫ్రెండ్సని చెప్పి, ఒకే రూమ్ లో ఏం చేస్తున్నారు? అన్నది రమ్య వాదన. అదీ పాయింటే. ఇప్పుడు నరేష్ సమాధానం చెప్పక తప్పదు. ఒకే రూమ్ లో ఇద్దరూ ఏం చేస్తున్నారు? అనే దానికి నరేష్ సమాధానం ఇవ్వకుండా.. రమ్యపై ఇంకొన్ని కొత్త ఆరోపణలు చేస్తున్నారు. రమ్యకు రాకేష్ రెడ్డితో అక్రమ సంబంధం ఉందని, రమ్య ఓ చీటర్ అని, తన చీప్ ట్రిక్స్‌కి తాను లొంగేది లేదని నరేష్ చెబుతున్నారు. ఇవన్నీ ఓకే.. కానీ పవిత్రతో.. ఒకే గదిలో ఎందుకు ఉండాల్సివచ్చింది? అనేదానికి సమాధానం లేదు.
ఇద్దరు మేజర్లు ఒకే రూమ్ లో ఉన్నప్పటికీ చట్ట రీత్యా నేరం కాదు.కాబట్టి... నరేష్, పవిత్రలకు పెద్దగా నష్టం లేదు. కానీ సమాజానికి.. నరేష్ భార్యకీ... ఆయన సమాధానం చెప్పాలి కదా?