యంగ్ హీరో నవదీప్ మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. బుల్లితెరపై ప్రసారం అవుతోన్న 'బిగ్‌బాస్' షోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇన్ అయ్యాడు నవదీప్. నవదీప్‌కి బుల్లితెర కొత్తేమీ కాదు. గతంలో 'సూపర్' అనే సెన్సేషనల్ రియాల్టీ షో ద్వారా నవదీప్ చాలా పాపులర్. అందాల భామలతో గ్లామరస్‌గా స్టంట్స్ చేయించాడు ఈ షోలో నవదీప్. ఇప్పుడు 'బిగ్‌బాస్'లోకి బిగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నవదీప్. అంతేకాదు 'బిగ్‌బాస్' హౌస్‌లోకి వెళ్లేందుకు నవదీప్‌కి స్పెషల్ ఎంట్రీ ప్లాన్ చేశాడు బిగ్‌బాస్ హోస్ట్ ఎన్టీఆర్. నవదీప్ కోసం ఓ స్పెషల్ బైక్‌ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ బైక్‌తో నవదీప్ హౌస్‌లోకి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న మాట. అంతేకాదు. బైక్‌తో పాటు ఎన్టీఆర్ ఓ హెల్మెట్‌ని కూడా ఫ్రీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక నెక్స్ట్ హౌస్‌లో నవదీప్ ఎలా ఉంటాడో, ఎలా ఆడియన్స్ మనసునీ, హౌస్ మేట్స్ మనసునీ గెలచుకుంటాడో చూడాలి. ఇకపోతే నిన్న జరిగిన ఎలిమినేషన్‌లో సింగర్ కల్పన ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుండి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చాక ఆమె పంచిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఆడియన్స్‌తో పాటు, ఎన్టీఆర్ కూడా ఫిదా అయిపోయారు. అందుకే హౌస్‌లో ఉన్న కల్పనకీ, హౌస్ బయట స్టేజ్ మీద ఉన్న కల్పనకీ అస్సలు సంబంధం లేదు అని ప్రశంసల వర్షం కురిపించేశారు. ఇక హౌస్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తోన్న నవదీప్ పర్‌ఫామెన్స్ చూడాలంటే మరి కొద్ది గంటలు మాత్రమే వేచి చూడాలి మరి.