నవదీప్‌ లవ్‌స్టోరీ చూస్తారా?

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నవదీప్‌కి రొమాంటిక్‌ హీరోగా లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువే. అయితే ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. హీరోగా కాకపోయినా, హీరో ఫ్రెండ్స్‌ రోల్స్‌లో పలు చిత్రాల్లో నటించాడు. 'ధృవ' సినిమాలో చరణ్‌కి ఫ్రెండ్‌గా కీలక పాత్రలో నటించాడు. చాలా రోజుల తర్వాత నవదీప్‌కి ఆ క్యారెక్టర్‌ మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఇవన్నీ కాక ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమైన 'బిగ్‌బాస్‌' షో ద్వారా నవదీప్‌ బాగా పాపులర్‌ అయిపోయాడు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హ్యాండ్‌సమ్‌ నవదీప్‌ ఆ షో స్వరూపాన్నే మార్చేశాడు. నవదీప్‌ ఎంట్రీతో ఈ షోకి కొంచెం గ్లామర్‌ యాడ్‌ అయినట్లయ్యింది. అయితే ఎండింగ్‌ వరకూ ఉండలేకపోయాడు. కానీ ఈ షో ద్వారా జనానికి బాగా దగ్గరయ్యాడు నవదీప్‌. ఇదిలా ఉండగా నవదీప్‌ హీరోగా ఓ వెబ్‌ సిరీస్‌ రన్‌ అవుతోంది. శశాంక్‌ ఏలేటి ఈ వెబ్‌సిరీస్‌ని రూపొందిస్తున్నారు. లేడీ డైరెక్టర్‌ నందినీ రెడ్డి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి చెందిన వెబ్‌ డివిజన్‌ ఎర్లీ మోన్‌సూన్‌ టేల్స్‌ సంస్థ ఈ వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ హీరోయిన్‌గా నటిస్తోంది. 'మన ముగ్గురి లవ్‌స్టోరీ' అనే టైటిల్‌తో ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందుతోంది. వెబ్‌ మీడియా బాగా డెవలప్‌ అయిన ఈ టైంలో వెబ్‌ సిరీస్‌ని మంచి డిమాండ్‌ ఉంది. ఇప్పటికే సుమంత్‌ అశ్విన్‌, వరున్‌ సందేశ్‌ తదితర యంగ్‌ హీరోలు వెబ్‌సిరీస్‌లో నటించారు. రానా కూడా ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS