కొత్త సినిమా షురూ చేసిన నవీన్‌ చంద్ర.!

మరిన్ని వార్తలు

'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్‌స్టర్‌ నవీన్‌ చంద్ర, తొలి సినిమాతోనే ఈ కుర్రాడిలో ఏదో విషయం ఉందనిపించుకున్నాడు. ఆ సినిమా మంచి పేరు తెచ్చింది నవీన్‌ చంద్రకు. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించారు. 'త్రిపుర' వంటి థ్రిల్లర్‌ మూవీస్‌లోనూ నటించి మెప్పించాడు.

 

మంచి టాలెంట్‌ ఉన్న కుర్రోడు. అరదుకే ఏదో ఒక సినిమా చేసేయాలనే తపనతో కాకుండా, హీరోగానే కాదు, ఇంపార్టెంట్‌ రోల్స్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్య 'అరవింద సమేత..'లో విలన్‌గా నటించి మెప్పించాడు. హీరో ఫీచర్స్‌తో పాటు, నెగిటివ్‌ షేడ్స్‌ కూడా తనలో బాగా ఉన్నాయని నిరూపించాడు. 'నేను లోకల్‌' సినిమాలో విభిన్నమైన పాత్ర పోషించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనోడి టాలెంట్‌ ఇప్పటికే దపదపాలుగా బయట పడింది. ఇక త్వరలో తమిళంలోకీ అడుగుపెట్టబోతున్నాడు నవీన్‌ చంద్ర. ఎంట్రీలోనే మంచి ఆఫర్‌ దక్కించుకున్నాడు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు, స్టార్‌ హీరో అయిన ధనుష్‌ సినిమాలో నవీన్‌ చంద్ర నటిస్తున్నాడు. ఈ సినిమాలో నవీన్‌ చంద్రది విలన్‌ రోల్‌ అనీ, అది చాలా పవర్‌ఫుల్‌ రోల్‌ అనీ తెలుస్తోంది. విలన్‌గా 'అరవింద సమేత..'లో నవీన్‌చంద్ర టాలెంట్‌ చూసి ఇన్‌స్పైర్‌ అయిన ధనుష్‌ తన సినిమా కోసం నవీన్‌చంద్రని ఏరి కోరి ఎంచుకున్నాడనీ కోలీవుడ్‌ టాక్‌. ఇదిలా ఉంటే, తెలుగులో నవీన్‌చంద్ర హీరోగా ఓ కొత్త సినిమా లేటెస్ట్‌గా లాంఛ్‌ అయ్యింది.

 

'వెంకటాపురం' వంటి విలక్షణ కథను పరిచయం చేసిన డైరెక్టర్‌ వేణు మాదికంటి ఈ సినిమాకి దర్శకుడు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS